ఈ చికెన్ తింటే చిక్కి శల్యమై పోవడం పక్కా.. హైదరాబాద్లో జైల్ మండి రెస్టారెంట్ కిచెన్ చూస్తే మళ్లీ తినరు!

ఈ చికెన్ తింటే చిక్కి శల్యమై పోవడం పక్కా.. హైదరాబాద్లో జైల్ మండి రెస్టారెంట్ కిచెన్ చూస్తే  మళ్లీ తినరు!

హైదరాబాద్ లో హోటల్ నిర్వాహకుల తీరు.. ఎవరేమై పోతే ఏంటి.. మనకు కావాలి డబ్బు..  అన్నట్లుగా తయారైంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంత తనిఖీలు చేసి, ఎంత మందిపై కేసులు పెట్టినప్పటికీ.. మారటం లేదు. కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, కల్తీ వస్తువులతో జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. 2026 మే 29 న హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో జైల్ మండిలో ఉన్న పరిస్థితులు చూసి షాకయ్యారు. 

శుక్రవారం మదీనగూడ జిస్మత్ జైల్ మండి రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. లేబుల్స్ లేకుండా ని చికెన్, మటన్, ఫిష్ ల్వ ఉంచినట్లు  గుర్తించారు. పాడైన నాన్‌ వెజ్ ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసినట్లు గుర్తించారు. FSSAI లైసెన్స్ లేకుండానే రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. 

పెస్ట్ కంట్రోల్, వాటర్ టెస్టింగ్, ఫుడ్ హ్యాండ్లర్స్ మెడికల్ రికార్డులు మెయింటెన్ చేయడం లేదని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. అపరిశుభ్రంగా కిచెన్, డిష్ వాష్ ఏరియా చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి ఫుడ్ ఎవరైనా తింటారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 రా మెటీరియల్ స్టోరేజ్ కంటైనర్లు అస్తవ్యస్తంగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. యాప్రాన్స్, హ్యాండ్ గ్లోవ్స్ లేకుండా పనిచేస్తున్న ఫుడ్ హ్యాండ్లర్స్ ను చూసి ఆగ్రహించారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా.. ప్రజారోగ్యాన్ని రిస్కులో పెట్టేలా వ్యవహరిస్తున్న నిర్వాహకులకు, రెస్టారెంట్ కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మొత్తంగా రెస్టారెంట్ హైజీన్ స్కోర్ కేవలం 43 శాతం మాత్రమే ఉందని తెలిపారు.