హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రూల్స్ పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కొరడా ఝళిపిస్తున్నారు. 2024 జూన్ 18వ తేదీన మాదాపూర్ లోని హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. FSSAI లైసెన్స్ లేకుండా సింధు ఉమెన్స్ హాస్టల్, తనుశ్రీ గ్రాండ్ ఉమెన్స్ హాస్టల్, ఓం శ్రీ సాయి నంద మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్, ఎస్సార్ లేడీస్ హాస్టల్ నడుపుతున్నట్లు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో వంట చేస్తూ, తుప్పు పట్టిన దోశ ప్యాన్ ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు అధికారులు. హస్టల్స్ లో గుట్కా నములుతూ వంటమనుషులు పని చేస్తున్నారన్నారు. ఎక్స్పైర్ అయిన కారంపొడి, వంటసామగ్రిని వాడతున్నారని చెప్పారు. ఈ హస్టళ్లపై కేసు నమోదు చేశామన్నారు.
Food Safety team, along with 'Food Safety on Wheels' vehicle, has conducted inspections in PGs/Hostels in Madhapur area on 18.06.2024. The below hostels were found to be operating ??????? ??? ????? ???????.
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) June 18, 2024
?????? ????? ?????'? ??????… pic.twitter.com/hw363NbPWG
ఇలాంటి ఆహారం తింటే ఆరోగ్యం పాడైపోతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. షార్ట్టర్మ్లో గ్యాస్ట్రిక్సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దీర్ఘకాలంలో మాత్రం కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. వాడిన నూనెను మళ్లీ వాడడం వల్ల కేన్సర్ వచ్చే ముప్పు ఉందని అంటున్నారు. స్టోర్ చేసిన ఫుడ్‌ను తిరిగి వేడి చేయడం ద్వారా అందులో ఫామ్ అయిన బ్యాక్టీరియా చనిపోయి విష పదార్థాలను విడుదల చేస్తుందని, అది తింటే గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు డయేరియా వస్తుందని చెబుతున్నారు. దీర్ఘకాలంలో పేగు, ప్యాంక్రియాటిక్ కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
