మాస్క్​ లేకుండా ఫ్యాన్స్ తో సెల్ఫీ.. దేశాధ్యక్షుడికి ఫైన్ వేసిన ఆఫీసర్లు

మాస్క్​ లేకుండా ఫ్యాన్స్ తో సెల్ఫీ.. దేశాధ్యక్షుడికి ఫైన్ వేసిన ఆఫీసర్లు
ప్రెసిడెంట్​ అయినా ఫైన్ వేసిన ఆఫీసర్లు  చిలీ: కరోనా రూల్స్‌ విషయంలో ఎవరైనా సరే అంటూ చిలీ అఫీసర్లు తమ ప్రెసిడెంట్​ను కూడా వదిలిపెట్టలే. బీచ్​లో మాస్క్ పెట్టుకోకుండా మహిళతో సెల్ఫీ తీసుకున్నందుకు ప్రెసిడెంట్​ సెబాస్టియన్‌ పినేరాకు 3,500(రూ.2.57 లక్షలు) డాలర్ల ఫైన్​ వేశారు. ఈ లాటిన్ అమెరికా దేశంలో కరోనా రూల్స్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. పబ్లిక్​ ప్లేసుల్లోకి వస్తే తప్పకుండా మాస్క్​ పెట్టుకోవాలి. లేకపోతే ఫైన్​ వేయడమే కాదు జైలుకూ పంపించే చాన్సులు ఉంటాయి. పినేరా సెల్ఫీ సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. దీంతో ఆయన క్షమాపణ చెప్పారు. కాచాగువాలో నడుచుకుంటూ వెళ్తుండగా, ఎవరో ఒకామె గుర్తుపట్టి సెల్ఫీ తీసుకుందని చెప్పారు.