విదేశాల్లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసమూ..రిలయన్స్ హెల్త్‌‌‌‌ పాలసీ

విదేశాల్లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసమూ..రిలయన్స్ హెల్త్‌‌‌‌ పాలసీ

న్యూఢిల్లీ : విదేశాల్లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయించుకోవాలనుకున్నా ఇన్సూరెన్స్ కవరేజ్ అందించేందుకు  రిలయన్స్‌‌‌‌ హెల్త్‌‌‌‌ గ్లోబల్‌‌‌‌ పాలసీని  రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్‌‌‌‌‌‌‌‌జీఐసీఎల్‌‌‌‌) తీసుకొచ్చింది. ఈ పాలసీ కొన్నవారు ఇండియాతో పాటు, విదేశాల్లోని హాస్పిటల్స్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకున్నా పాలసీ క్లయిమ్ చేసుకోవచ్చు. క్యాన్సర్‌‌‌‌, బైపాస్‌‌‌‌ సర్జరీ వంటి క్రిటికల్ చికిత్సలను కూడా ఈ పాలసీ కవర్ చేస్తుందని ఆర్‌‌‌‌‌‌‌‌జీఐసీఎల్‌‌‌‌ ప్రకటించింది. వైద్యం కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ట్రావెల్ అకామిడేషన్‌‌‌‌,  వీసా సౌకర్యం, అసిస్టెంట్ సర్వీస్‌‌‌‌లు అందిస్తామని, పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌ పోయినా లేదా అర్జెంట్‌‌‌‌గా డబ్బు కావాలన్నా సాయం చేస్తామని పేర్కొంది.

రిలయన్స్‌‌‌‌ హెల్త్‌‌‌‌ గ్లోబల్ పాలసీ సమ్‌‌‌‌ ఇన్సూర్డ్‌‌‌‌ మిలియన్ డాలర్లు (రూ.8.3 కోట్లు). ఎయిర్ ఆంబులెన్స్‌‌‌‌, ఆర్గాన్‌‌‌‌ డోనర్‌‌‌‌‌‌‌‌ ఖర్చులను కూడా ఈ కొత్త పాలసీ కవర్ చేస్తుందని ఆర్‌‌‌‌‌‌‌‌జీఐసీఎల్‌‌‌‌ పేర్కొంది. రూమ్ రెంట్‌‌‌‌పై ఎటువంటి రిస్ట్రిక్షన్లు లేవని తెలిపింది. ‘చాలా మంది ఇండియన్లు వర్క్ లేదా సరదాగా గడిపేందుకు విదేశాలకు వెళుతున్నారు. ఇండియాలో, విదేశాల్లో కవరేజ్ అందించే అనేక పాలసీలు కొనాల్సిన బాధను తప్పించాం. ఈ రెండు ఇచ్చే పాలసీ తీసుకొచ్చాం’ అని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌‌‌‌ సీఈఓ రాకేష్‌‌‌‌ జైన్ అన్నారు. ఈ కంపెనీ  రిలయన్స్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌కు సబ్సిడరీ.