సిరికొండ రేంజ్ పరిధిలో పులి కదలికల పరిశీలన

సిరికొండ రేంజ్ పరిధిలో పులి కదలికల పరిశీలన

సిరికొండ, వెలుగు : సిరికొండ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో పులి అడుగుజాడలను డీఎఫ్​వో వికాస్​మీనన్​బుధవారం పరిశీలించారు.  పందిమడుగు, చిమన్​పల్లి, తాటిపల్లి ఫారెస్ట్​లో గత ఏడాది జూలైలో పులి సంచరించిన ప్రాంతంలో ఆధారాలను సేకరించారు. అనంతరం ఫారెస్ట్​అధికారులతో మాట్లాడుతూ ఫారెస్ట్​కు ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు గుంపులుగా వెళ్లి  పనులు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

ఫారెస్ట్​కు దూరంగా పశువులను మేపుకునేలా, పులి కనిపిస్తే సమాచారం ఇచ్చేలా ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఎఫ్​డీవో భావని శంకర్, ఎఫ్​ఆర్వో నర్సింగ్ రావు, డీఆర్​వో గంగారాం, సిరికొండ, కమ్మరిపెల్లి రేంజ్​ ఫారెస్ట్​ సిబ్బంది ఉన్నారు.

అబ్బపూర్ (ఎం) గ్రామంలో.. 

నవీపేట్ : మండలంలోని అబ్బపూర్ (ఎం) గ్రామంలో చిరుత పులి దాడి చేసిన ప్రదేశాన్ని ఎఫ్ ఆర్వో సంజయ్ గౌడ్ బుధవారం పరిశీలించారు. ఆదివారం రాత్రి దుడపై చిరుత దాడి చేయగా,  బోను ఏర్పాటు చేయాలని సర్పంచ్ శ్రీనివాస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. బాధితుడికి పరిహారం అందేలా చూస్తామని, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  అయన వెంట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, మాజీ ఉప సర్పంచ్ పశుల శ్రీనివాస్ జాహుర్, బీట్ ఆఫీసర్ సుధీర్ ఉన్నారు.