ఫామ్హౌస్ వ్యూహం: శుద్ధి.. దళిత వ్యతిరేక అహంకారానికి పరాకాష్ట

ఫామ్హౌస్ వ్యూహం: శుద్ధి.. దళిత వ్యతిరేక అహంకారానికి పరాకాష్ట
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులతో రావడం 
  • సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్​ దీపక్ జాన్  

పద్మారావునగర్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్​రావు, కేటీఆర్​శాసనసభ కార్యకలాపాలను అడ్డుకునేందుకు కుట్ర పన్నారని సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ఆరోపించారు. 

పద్మారావునగర్‌‌‌‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో రచించిన వ్యూహంలో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులతో వచ్చి గందరగోళం సృష్టించారన్నారు. స్పీకర్‌‌‌‌ను దూషించడం, అనంతరం ఫామ్‌‌‌‌హౌస్ సమీపంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టడం వారి దళిత వ్యతిరేక అహంకారానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. 

స్పీకర్‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను బర్తరఫ్ చేయాలని, శుద్ధీకరణ పేరుతో విద్వేష చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు.