ముషీరాబాద్, వెలుగు : తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నూతన జేఏసీ ఏర్పాటు అయింది. మంగళవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యూనియన్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన ఆర్టీసీ జేఏసీని ఏర్పాటు చేశారు. చైర్మన్గా ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ గా ఎం.థామస్ రెడ్డి
కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్ సుద్దాల సురేశ్, కత్తుల యాదయ్య, బి.యాదగిరి నియమితులయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని, యూనియన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక కార్మికులపై పనిభారం పెరిగిందని చెప్పారు.
