ఉత్తరాఖండ్ గవర్నర్‌‌గా మాజీ ఆర్మీ ఆఫీసర్.. తమిళనాడుకు మాజీ ఐపీఎస్‌

ఉత్తరాఖండ్ గవర్నర్‌‌గా మాజీ ఆర్మీ ఆఫీసర్.. తమిళనాడుకు మాజీ ఐపీఎస్‌

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల గవర్నర్ల అపాయింట్‌మెంట్లకు సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ప్రకటనను రాష్ట్రపతి భవన్ రిలీజ్ చేసింది. ఉత్తరాఖండ్ గవర్నర్‌‌గా ఉన్న బేబీ రాణి మౌర్య రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారని, ఆమె స్థానంలో కొత్తగా మాజీ ఆర్మీ ఆఫీసర్, లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్‌ను నియమించారని అందులో పేర్కొంది. 

డిప్యూటీ చీఫ్​ ఆఫ్​ ఆర్మీ స్టాఫ్‌ స్థాయిలో పని చేసి..

గుర్మిత్ సింగ్ 2016 ఫిబ్రవరిలో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. ఆయన 40 ఏండ్ల పాటు ఆర్మీలో సర్వీస్ చేశారు. డిప్యూటీ చీఫ్​ ఆఫ్​ ఆర్మీ స్టాఫ్ స్థాయి వరకూ వెళ్లారు. చైనాతో ఉన్న సరిహద్దు వివాదాల్లో ఆపరేషనల్, మిలటరీ స్ట్రాటజిక్ ఇష్యూలపైనా గుర్మిత్ సింగ్ పని చేసి, కీ రోల్ ప్లే చేశారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్​ మిలటరీ ఆపరేషన్స్ ర్యాంక్‌లో ఆయన ఈ వ్యవహారాలను డీల్ చేశారు.

గుజరాత్‌కు తమిళనాడు గవర్నర్

తమిళనాడుకు గవర్నర్‌‌గా ఉన్న బన్వరీలాల్ పురోహిత్‌ కొన్నాళ్లుగా పంజాబ్‌ గవర్నర్‌‌గా కూడా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయనకు పూర్తిగా పంజాబ్‌ బాధ్యతలను మాత్రమే అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తమిళనాడుకు గవర్నర్‌‌గా ప్రస్తుతం నాగాలాండ్‌లో గవర్నర్‌‌గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎన్‌ రవిని అపాయింట్ చేశారు. నాగాలాండ్‌ గవర్నర్ బాధ్యతలను అస్సాం గవర్నర్ ప్రొఫెసర్ జగదీశ్ ముఖికి అదనంగా అప్పగించారు.