త్వరలో కాంగ్రెస్​లో బీఆర్ఎస్ విలీనం..రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు: బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ​ప్రభాకర్ 

త్వరలో కాంగ్రెస్​లో బీఆర్ఎస్ విలీనం..రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు: బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ​ప్రభాకర్ 

హైదరాబాద్, వెలుగు: త్వరలోనే కాంగ్రెస్​లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల మధ్య డీల్ కుది రిందని, నాయకుల మధ్య రాజీ జరిగిందని చెప్పారు. రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ మాట నిలబెట్టుకున్నారని, ఇప్పుడు కేసీఆర్ తన మాట నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ విలీనం చేయనున్నట్లు చెప్పారు.

విలీన ప్రక్రియ  జూన్ 2  లేక డిసెంబర్ 9 తర్వాత తథ్యమని స్పష్టం చేశారు.  కవిత కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాదిని రాజ్యసభకు పంపడం, రెండు పార్టీల మధ్య అంతర్గత ఒప్పందాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఆ తర్వాత క్రమంలోనే వివిధ కేసుల్లో విచారణ కమిటీలు మందకొడిగా ఎలా సాగుతున్నాయనేది ప్రజలు గమనిస్తున్నారని వివరించారు.