సావో పాలో: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో (70)ను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని బ్రసిలియాలో శనివారం ఉదయం 6 గంటలకు ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకుని పోలీస్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌కు తరలించా రు. తిరుగుబాటుకు కుట్రపన్నారన్న కేసులో ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు ఇదివరకే 27 ఏండ్ల జైలుశిక్ష పడింది. మరికొన్ని రోజుల్లోనే ఆయన జైలుకు వెళ్లాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ముందుగానే ఆయనను అరెస్టు చేశారు. బోల్సనారో2019 నుంచి 2022 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేశారు.
