కొత్త వాళ్లు బాగా ఆడాలి: రోహిత్‌‌‌‌‌‌‌‌

కొత్త వాళ్లు బాగా ఆడాలి: రోహిత్‌‌‌‌‌‌‌‌

ముంబై: ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన కొత్త వాళ్లు బాగా ఆడాలని మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ సూచించాడు. కొత్త కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా సారథ్యంలో ఆరో టైటిల్‌‌‌‌‌‌‌‌ గెలవాలని ఫ్రాంచైజీ లక్ష్యంగా పెట్టుకుందన్నాడు. ఈసారి లీగ్‌‌‌‌‌‌‌‌ కోసం గెరాల్డ్‌‌‌‌‌‌‌‌ కోయెట్జీ, క్వెనా ఎంపాకా, ల్యూక్‌‌‌‌‌‌‌‌ వుడ్‌‌‌‌‌‌‌‌, నువాన్‌‌‌‌‌‌‌‌ తుషార, రొమారియో షెఫర్డ్‌‌‌‌‌‌‌‌, మహ్మద్‌‌‌‌‌‌‌‌ నబీ, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ గోపాల్‌‌‌‌‌‌‌‌ని ఎంఐ కొత్తగా తీసుకుంది.

 ‘ఆక్షన్‌‌‌‌‌‌‌‌లో మేం చాలా మంది కొత్త ప్లేయర్లను తీసుకున్నాం. వీళ్లకు డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌, ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో మంచి ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. వాళ్లందరూ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో రాణించాలని కోరుకుంటున్నా. ఈ రోజు నుంచే వాళ్లు మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా. ప్రతి టోర్నీకి ముందు ప్రిపరేషన్స్‌‌‌‌‌‌‌‌ చాలా ముఖ్యం. అది ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది’ అని హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు.