
- రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి
ఖైరతాబాద్,వెలుగు : వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి ప్రధాన రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. తెలంగాణ దళిత బహుజన సమితి రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రవి మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం 75శాతం ఉన్న మాదిగలకు 3 ఎంపీ సీట్లు దక్కాల్సి ఉందన్నారు. అలా కాకున్నా వరంగల్, పెద్దపల్లి సీట్లును మాదిగలకు కేటాయించాలని ఆయన కోరారు.
ఈసందర్భంగా తెలంగాణ దళిత బహుజన సమితి అధ్యక్షుడుగా గజ్జెల్లి మల్లికార్జున్, ఉపాద్యక్షుడిగా రఘునాథ్, మేడా శ్రీను, ప్రధాన కార్యదర్శిగా లింగాల కరుణాకర్, ప్రచార కమిటీ చైర్మన్ గా ఎం.కార్తీక్ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం వివిధ జిల్లాలు, మండల కమిటీలను ప్రకటించి సర్టిఫికెట్లను అందజేశారు.