చంద్రబాబుకు చేదు అనుభవం

చంద్రబాబుకు చేదు అనుభవం

గన్నవరం ఎయిర్ పోర్టులో సామాన్యుడి తరహాలో తనిఖీ

అమరావతి, వెలుగు: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఆయన ఎయిర్ పోర్టుకు చేరుకోగా వాహనంలో లోపలికి  వెళ్లేందుకు  భద్రతా సిబ్బంది అనుమతి నిరాకరించారు. సామాన్య ప్రయాణికుడి తరహాలో బాబును తనిఖీ చేశారు. వీఐపీ, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నా ఆయనకు ప్రత్యేక వాహనం కేటాయించలేదు. ఎయిర్ పోర్టు లాంజ్ నుంచి విమానం వరకు ప్రయాణికుల బస్సులోనే బాబు వెళ్లారు. చంద్రబాబు కాన్వాయ్ కి పైలెట్ క్లియరెన్స్ తొలగించడంతో ట్రాఫిక్ లో ఆయన వాహనం ఆగితే భద్రతకు ముప్పని టీడీపీ వర్గాలు ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశాయి