ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు నికొలస్‌ సర్కోజికి జైలు

ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు నికొలస్‌ సర్కోజికి జైలు

ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు నికొలస్‌ సర్కోజికి పారిస్‌ కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. అవినీతికి పాల్పడటంతో పాటు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణల కింద ఈ శిక్ష విధించారు. ఇందులో ఏడాది జైలు శిక్ష, రెండేళ్ళు సస్పెండ్‌ చేసినా.. జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్‌ అధ్యక్షునిగా ఉన్న నికొలస్‌ సర్కోజీ ఓ సీనియర్‌ మెజిస్ట్రేట్‌ నుంచి ఒక కేసుకు సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా పొందేందుకు ప్రయత్నించారు. ఆ కేసులో సర్కోజీ ప్రమేయం కూడా ఉంది. ఎలక్ట్రానిక్‌ బ్రేస్‌లెట్‌ వేసుకుని… ఇంటి దగ్గరే జైలు శిక్షను అనుభవించేందుకు అర్హత ఉందని, అవసరమైతే దాని కోసం ఆయన దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. 2012లో జరిగిన ఎన్నికల్లో అక్రమంగా నిధులు సమకూర్చుకున్నారనే ఆరోపణలకు సంబంధించిన మరో కేసును ఆయన ఈ నెలలోనే ఎదుర్కోనున్నారు.