- బండారు దత్తాత్రేయ
ముషీరాబాద్, వెలుగు: అందెశ్రీ మరణం తెలంగాణ సమాజం, సాహిత్య లోకానికి తీరని లోటని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం లాలాపేట్ కు వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఆత్మను మేల్కొల్పిన గొప్ప వ్యక్తి అందెశ్రీ అని కొనియాడారు.
