ఆర్1 జోన్ ఎత్తివేతతో రైతులకు ఇబ్బందులు: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ఆర్1 జోన్ ఎత్తివేతతో రైతులకు ఇబ్బందులు: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

మేడ్చల్, వెలుగు: ఎల్లంపేట పురపాలక పరిధిలో ఆర్​1 జోన్‌‌‌‌ను ఎత్తేసి మల్టీపుల్‌‌‌‌ జోన్‌‌‌‌గా మార్చడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం నూతనకల్‌‌‌‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ సర్వీస్‌‌‌‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములకు రోడ్డు వేసుకునేందుకు ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. 

కొన్ని చోట్ల రైల్వే గేట్ల కారణంగా సర్వీస్‌‌‌‌ రోడ్డులు అసంపూర్తిగా ఉండటం రైతులకు సమస్యలు సృష్టిస్తోందని, వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా రైతులకు 100 శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మహానగరానికి కన్వర్షన్‌‌‌‌ జోన్లు లేకపోవడం తప్పిదమని, హైదరాబాద్‌‌‌‌ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌‌‌‌ రూపొందించాలని సూచించారు.