దుబాయ్ కి చెందిన ప్లే బ్యాక్ సింగర్ అబ్దు రోజిక్ హిందీ బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో 16 వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆటతీరుతో ప్రేక్షకులను అలరించాడు. అంతేగాకుండా తక్కువ సమయం బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పటికీ లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నాడు. అయితే తాజాగా అబ్దు రోజిక్ తన నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన విషయం గురించి స్పందించాడు.
ఇందులో భాగంగా తనకు కాబోయే భార్య అమీరాతో పలు సాంస్కృతిక వ్యత్యాసాలు, విభేదాలు ఏర్పడ్డాయని దాంతో ఇరువురి పరస్పర అంగీకారంతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితులలో తనని అర్థం చేసుకోవడంతోపాటూ అండగా నిలబడే లైఫ్ పార్ట్నర్ కావాలని కానీ ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయాయని చెప్పుకొచ్చాడు.
అలాగే తాను ఈ సంఘటన నుంచి కోలుకుని తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారిస్తానని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ప్రతీఒక్కరూ అర్థం చేసుకుని తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవించాలని తన అభిమానులని కోరాడు.