మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. మోదీని ప్రశంసించిన మిథాలీ

 మహిళా రిజర్వేషన్‌ బిల్లు..  మోదీని ప్రశంసించిన మిథాలీ

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించినందుకు భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీని భారత మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ప్రశంసించారు.  మహిళా సాధికారత దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని తెలిపారు.  మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై తనకు చాలా ఆశలు ఉన్నాయన్న  మిథాలీ..  ఈ బిల్లు అమల్లోకి వస్తే..  లోక్ సభ, అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పారు.  అప్పుడు వారు మహిళల సమస్యలపై ఎక్కువ దృష్టి సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు.  మహిళలుకు మద్దుతుగా వారు చట్టసభల్లో  తమ అభిప్రాయాలను వెల్లడించొచ్చునని చెప్పుకొచ్చారు.  

చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచేందుకు ఉద్దేశించిన ‘ నారీశక్తి వందన్’ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్ వాల్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. 128వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్టు ఆయన పార్లమెంటుకు వెల్లడించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే లోక్ సభలో మహిళా ఎంపీల సంఖ్య 181కి  పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో మహిళా సభ్యుల సంఖ్య 40కి చేరే అవకాశం ఉంది. కొత్త పార్లమెంటులో ప్రవేశపెట్టిన మొదటి బిల్లు నారీ శక్తి వందన్  కావడం గమనార్హం.