‘CAG’గా గిరీష్ చంద్ర‌ ముర్ము ప్రమాణం

‘CAG’గా గిరీష్ చంద్ర‌ ముర్ము ప్రమాణం

భారత ‘కం‌ప్ర్టో‌లర్‌ అండ్‌ ఆడి‌టర్‌ జన‌ర‌ల్‌’(CAG ) గా గిరీష్‌ చంద్ర ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిభవన్‌లో ఇవాల(శనివారం) ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూర్తి కోవిడ్19 నిబంధనలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహెర్షి పదవీ విరమణ చేయడంతో … ఆయన స్థానంలో ముర్ము బాధ్యతలు చేపట్టారు. జ‌మ్మూ క‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ పద‌వికి ముర్ము రెండు రోజుల క్రితమే రాజీనామా చేశారు. ఆయన 1985 బ్యాచ్ కు చెందిన IAS అధికారి.