ముంబై మెరైన్ డ్రైవ్ లో వల్గర్ డ్యాన్స్ చేసిన యూట్యూబర్.. వీడియో వైరల్

ముంబై మెరైన్ డ్రైవ్ లో వల్గర్ డ్యాన్స్ చేసిన యూట్యూబర్.. వీడియో వైరల్

ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ ముంబైలోని మెరిన్ డ్రైవ్ లో వల్గర్ డాన్స్ చేస్తూ ఇన్ స్టా రీల్స్ చేసింది. అదీ పబ్లిక్ చూస్తుండగా కెమెరా ముందు అసభ్యకరమై న రీతిలో స్టెప్పులు వేసింది. ఇది అక్కడున్న వారిని అవాక్కయ్యేలా చేసింది. పబ్లిక్ లో ఇదేం పని అని చెవులు కొరుక్కోవడం చేశారు. 

ఈ వీడియో చేసిన డాన్సర్ మనీషా.. యూట్యూబర్, ఇన్ స్టా ఇన్ ఫ్ల్యూయెన్సర్.. తన డాన్స్ స్కిల్స్ ను ముంబై ఐకానిక్ స్పాట్ అయిన మెరిన్ డ్రైవ్ లో ప్రదర్శించింది.  లేత పసుపు రంగు లెహంగాలో కెమెరా నుంచి డాన్స్ ఫ్లోర్ వైపు రన్ చేస్తూ వీడియోను ప్రారంభించింది. అక్కడున్న వారిని, నెటిజన్లను ఆకర్షించేందుకు కొన్ని పెప్పి ట్వెర్కింగ్ మూవ్ మెంట్లను తనదైన శైలీలో ప్రదర్శించింది.

ఇన్ స్టాలో వీడియో వైరల్ 

మే23 న ఇన్ స్టాలో డాన్సర్ మనీషా ఈ వీడియోను అప్ లోడ్ చేసింది. ఆన్ లైన్ పోెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈమె డాన్స్ రీల్ తెగ వైరల్ అయింది. వేలకొద్ది లైకులు వచ్చాయి. 45 వేల మంది నెటిజన్లు ఆమె డాన్స్ వీడియోను చూశారు. మనీషా లస్టీ డాన్స్ మూవ్ మెంట్స్ ఎంజాయ్ చేశారు. హార్ట్, క్లాపింగ్ ఎమోజీలను కామెంట్ సెక్షన్ షేర్ చేశారు. 

యూట్యూబర్ మనీషాకు ఇలాంటి వీడియోలు చేయడం కొత్తేమి కాదు. గతంలో కూడా అర్థగన్నంగా డాన్సులు చేస్తూ వీడియోలను షేర్ చేసింది. ఢిల్లీ మెట్రోలో ఆమె ప్రముఖ బాలీవుడ్ సాంగ్..కాగజ్ కలాం దావత్'కు మెలికలు తిరుగుతూ, బొడ్డు నృత్యం చేస్తూ కనిపించింది.ఈ వీడియోలు ఇంటర్నెట్ లో తుఫాన్ సృష్టించాయి. 

ఏదీ ఏమైనా మనీషా డాన్స్ పర్మార్మెన్స్ కొందరు నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తితే మరకొందరు పబ్లిక్ లో ఇదేం పని అని విసుక్కున్నారు.