లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్

హైదరాబాద్ : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఎల్బీనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్ భార్గవ్. కర్మన్ ఘాట్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి నరసింహా రెడ్డి ఇంటి నెంబర్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని ఫీజు కట్టినా నెంబర్ కేటాయించలేదు. బిల్ కలెక్టర్ భార్గవ్ ను సంప్రదించగా 10వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించారు నరసింహారెడ్డి.

ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా బిల్ కలెక్టర్ భార్గవ్ ను రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్నారు ఏసీబీ డీఎస్పీ ఆనంద్.