టీజీఎస్ఆర్టీసీ ఫేక్ లోగో.. ఇద్దరిపై కేసు నమోదు

టీజీఎస్ఆర్టీసీ ఫేక్ లోగో.. ఇద్దరిపై కేసు నమోదు

టీజీఎస్ఆర్టీసీ ఫేక్ లోగో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ హైదరాబాద్  చిక్కడపల్లి పోలీస్  స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అధికారులు. ఈ ఘటనపై కొణతం దిలీప్ , హరీశ్  రెడ్డిపై ఐపీసీ తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. నిందితులు TGSRTCకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోస్టులు పెడ్తున్నారు ఆర్టీసీ అధికారులు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. 

టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇవాళ ఉదయం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని తెలిపారు. టీజీఎస్‌ఆర్టీసీ  కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్‌ అని వెల్లడించారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని సజ్జానర్ తెలిపారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని చెప్పారు. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని వెల్లడించారు టీజీఎస్ ఆర్టీసీ  ఎండీ సజ్జనార్