నన్ను భయపెట్టలేరు..ఇంటర్వ్యూలో సహనం కోల్పోయిన ప్రశాంత్ కిషోర్

నన్ను భయపెట్టలేరు..ఇంటర్వ్యూలో సహనం కోల్పోయిన ప్రశాంత్ కిషోర్

ఇటీవల పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఓ ఇంటర్వ్యూలో సహనం కోల్పోయి కోపంతో ఊగిపోయారు. ఇంటర్య్వూలో భాగంగా 2022లో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఓటమి గురించిన మీ అంచనా తప్పు అయింది కదా అని సీనియర్ జర్నలిస్ట్ కరన్ థాపర్ అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ తోక తొక్కిన పాములా బుసలు కొట్టాడు. ఆధారాలుంటే చూపించాలని గట్టిగా అరిచాడు.

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఓడిపోతుందని తాను అన్నట్లు ఏమైనా వీడియో ఆధారాలుంటే చూపించాలని డిమాండ్ చేశారు. హిందుస్తాన్ టైమ్స్, టైమ్స్ వంటి పత్రికలు, ప్రముఖ వెబ్ సైట్లు ప్రచురించాయని గుర్తు చేయగా.. పత్రికలు , వెబ్ సైట్లు ఇష్టానుసారంగా రాస్తాయి.. అన్నీ నేను చెప్పినవే అనుకోకూడదని అన్నారు. 

మీ ఇంటర్వ్యూలకు వచ్చే వాళ్లపై మీరు అనుకున్నదే నిజం అని రుద్దే ప్రయత్నం చేస్తారు..అలాంటి నామీ చేయలేరు అని పెద్దగా స్వరం పెంచి వార్నింగ్ ఇచ్చి న ట్లుగా చెప్పారు. ఇక తెలంగాణ బీఆర్ ఎస్ గెలుస్తుందంటూ అంచనా వేశారు కదా..అని కరన్ థాపర్ అడిగే ప్రయత్నం చేసినా ప్రశాంత్ కిషోర్ పట్టించు కోలే దు. మీరు ఇంటర్వ్యూ పేరుతో నన్ను భయపెట్టాలని చూస్తున్నారు... నేను భయపడే మనిషిని కాదని.. కొంతమంది పారిపోయినట్లు నేను అలా చేయను అని చెప్పు కొ చ్చారు ప్రశాంత్ కిషోర్. 

చివరికి కరన్ థాపరే కొద్దిగా తగ్గి కంగ్రాట్స్.. ఇంటర్వ్యూ కొనసాగించండి అని చెప్పడంతో ప్రశాంత్ కిషోర్ కొద్దిగా చల్లబడ్డారు. ఈ ఇంటర్య్వూ వీడియోను ది వైర్  సంస్థ విడుదల చేయగా.. ఓ నెటిజన్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం x లో పోస్ట్ చేశారు.  దీంతో నెట్టింట హల్ చల్ చేస్తోంది ఈ వీడియో. 

దీనిపై స్పందించిన ప్రశాంత్ కిషోర్ ‘నా అసెస్ మంట్ తో ఎవరైతే గిలగిలలాడుతున్నారో వారంతా జూన్ 4న వాటర్ చేతిలో పట్టుకొని సిద్దంగా ఉండాలని’ హెచ్చ రించారు.