బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సోదరుడు అయాజుద్దీన్ అరెస్ట్​ .. ఎందుకంటే..

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ  సోదరుడు అయాజుద్దీన్ అరెస్ట్​ .. ఎందుకంటే..

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అన్నయ్య అయిన అయాజుద్దీన్ సిద్ధిఖీని బుధానా పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో బుధవారం, మే 22న అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముజఫర్‌నగర్‌లో భూ వివాదానికి సంబంధించిన ఫోర్జరీ కేసులో పోలీసులు అయాజుద్దీన్‌ను ఫోర్జరీ ఆరోపణలపై అరెస్టు చేశారు.

అయాజుద్దీన్ సిద్ధిఖీపై ఆరోపణలు

జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు తరపున అయాజుద్దీన్ కన్సాలిడేషన్ విభాగానికి ఫేక్​ డాక్యుమెంట్​ను సమర్పించాడనే  ఆరోపణలపై  అరెస్టు చేశారు.  ఈ ఫోర్జరీకి జావేద్ ఇక్బాల్ అనే వ్యక్తితో కొనసాగుతున్న భూ వివాదంతో ముడిపడి ఉంది. తప్పుడు ఉత్తర్వు కనుగొనబడిన తర్వాత, జిల్లా మేజిస్ట్రేట్ ఫిర్యాదును దాఖలు చేశారు, అయాజుద్దీన్‌పై ఐపీసీ 420, 467, 468 మరియు 471 సెక్షన్‌ల కింద అభియోగాలు మోపారు.  అయాజుద్దీన్ సిద్ధిఖీ జిల్లా మేజిస్ట్రేట్ (DM) కోర్టులో   ఫేక్​ డాక్యుమెంట్లు  దాఖలు చేశారని ఫిర్యాదుదారు ఆరోపించాడు. విచారణలో ఆరోపణలు నిజమని తేలిందని SHO తెలిపారు. DM రీడర్ రాజ్‌కుమార్  ఫిర్యాదుపై  ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు మిశ్రా తెలిపారు.