డోంట్ వర్రీ : షారూఖ్ ఖాన్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు..

డోంట్ వర్రీ : షారూఖ్ ఖాన్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు..

సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన మేనేజర్ పూజా దద్లానీ ఆప్డేట్ ఇచ్చారు.  డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ కారణంగా మే 22వ తేదీ బుధవారం షారుక్ ఖాన్ అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మే 23వ తేదీ గురువారం షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ ఆయన ఆరోగ్య విషయాలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు."ప్రస్తుతం షారూఖ్ ఖాన్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు.  సూపర్ స్టార్ అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు. మిస్టర్ ఖాన్ పై మీ ప్రేమ, ప్రార్థనలు, ఆందోళనకు ధన్యవాదాలు" అని పూజా దద్లానీ పోస్ట్ పెట్టారు. బుధవారం షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, అతని స్నేహితురాలు జుహీ చావ్లా ఆసుపత్రికి వచ్చి ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.

 IPL జట్టు KKR సహ-యజమాని అయిన జుహీ చావ్లా, షారుఖ్ ఆరోగ్యంపై స్పందిస్తూ.. "షారుఖ్ ఆరోగ్యం గత రాత్రి బాగా లేదు.. కానీ ఈ రోజు సాయంత్రం ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. దేవుడు దయతో అయన త్వరలో పూర్తిగా కోలుకుంటారు.  కేకేఆర్ ఫైనల్స్ ఆడేటప్పుడు స్టాండ్స్‌లో నుంచి జట్టును ఉత్సాహపరుస్తాడు"  అని పేర్కొంది.

కాగా, అహ్మదాబాద్ లో జరిగిన హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో షారూఖ్ ఖాన్ ను ఆయన సిబ్బంది.. హుటాహుటిన అహ్మదాబాద్ లోని కె.డి. ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు.