పుష్ప 2లో అల్లుఅర్జున్ తో స్టెప్పులేయనున్న యానిమాల్ బ్యూటీ!

పుష్ప 2లో అల్లుఅర్జున్ తో స్టెప్పులేయనున్న యానిమాల్ బ్యూటీ!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2: ది రూల్.  ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా బన్నీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ నుంచి మే 23వ తేదీ గురువారం విడుదల చేసిన రెండో సాంగ్ వీడియో అనౌన్స్ మెంట్ కూడా ఆకట్టుకుంటోంది. మే 29వ తేదీన ఈ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అదేంటంటే.. యానిమాల్ సినిమాతో యూత్ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి.. పుష్పరాజ్ తో స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది.  పుష్ప సినిమాలో ఊ అంటావా మావా ఉఊ అంటావా అంటూ సమంత.. బన్నీతో కలిసి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప2లో వచ్చే ఐటమ్ సాంగ్.. మరో రేంజ్ లో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ  సాంగ్ లో త్రిప్తి దిమ్రి తన డ్యాన్స్ తో మరోసారి కుర్రాళ్ల మతిపోగొట్టనుందని టాక్. సినీ వార్గాల సమాచారం ప్రకారం.. పుష్ప2లో ఐటమ్ సాంగ్ కోసం ఇప్పటికే మేకర్స్ త్రిప్తి దిమ్రి సంప్రదించారట. బన్నీతో చిందులేసేందుకు ఈ బ్యూటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సాంగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

కాగా, సినిమా విషయానికి వస్తే..  మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో  నిర్మిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్ గా  నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ గా నిలిచిన నేపధ్యంలో పార్ట్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా మేకర్స్.. పుష్ప పార్ట్ 2పై మరింత హైప్ వచ్చేలా సినిమాకు సంబంధించిన సాంగ్, గ్లింప్స్, టీజర్ లను విడుదల చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.