
కర్ణాటకకి చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి వద్ద గతంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా పనిచేసిన 58 ఏళ్ల వ్యక్తి సెక్స్‌టార్షన్ రాకెట్ ఉచ్చులో చిక్కుకుని ఏకంగా రూ.7 లక్షలు నష్టపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఎస్డీగా పని చేసిన ఓ బాధితుడు మల్లేశ్వరంలో నివసిస్తున్నాడు.
మహారాష్ట్ర నాసిక్ లోని ఓ గెస్ట్‌హౌస్‌లో జూన్12 ఆయన స్నానం చేసి వచ్చాడు. అదే సమయంలో గుర్తు తెలియని మహిళ వీడియో కాల్ చేసింది. అతను వీడియో కాల్ మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. మరుసటి రోజు మధ్యాహ్నం అతనికి గుర్తు తెలియని నంబర్‌తో మరో కాల్ వచ్చింది.
తాను హిందీ ఛానల్ రిపోర్టర్మహేంద్ర సింగ్‌గా పరిచయం చేసుకుని వీడియో కాల్ ప్రస్తావన తెచ్చాడు. వీడియో కాల్లో మహిళను వేధించి, అనుచితంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు మహేంద్ర సింగ్‌చెప్పాడు.
ALSO READ :రాహుల్ లేట్ గా నిద్రలేచారు.. నిశీకాంత్ దూబే సెటైర్లు
మహిళతో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో పోస్ట్ చేస్తామని బెదిరించిన రిపోర్టర్డబ్బు ఇస్తే వీడియో డిలీట్ చేస్తామని బాధితుడిని నమ్మించారు. జూన్12న తాను మాట్లాడిన వీడియోకాల్రికార్డుకు గురైనట్లు గుర్తించిన బాధితుడు వీడియోను బయటపెట్టకూడదని వేడుకుంటూ వారి అకౌంట్‌కు రూ.2 లక్షల్ని బదిలీ చేశాడు.
జులై 14న మళ్లీ అతని ఫోన్ కి నాలుగు వేర్వేరు నంబర్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. రూ.5 లక్షలు పంపాలని డిమాండ్ చేయడంతో అప్పుడూ పంపాడు. రూ.7 లక్షలు చెల్లించాక కూడా ఇంకా వేధింపులు ఆగకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.