బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్​ చవాన్​

బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్​ చవాన్​

ముంబై: కాంగ్రెస్​కు రాజీనామా చేసిన మరుసటి రోజే మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీలో చేరారు. మంగళవారం ముంబైలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం చవాన్ మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో కొత్త జర్నీ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రధాని మోదీ ‘సబ్​కా సాత్, సబ్​ కా వికాస్’ నినాదం, దేశంలో కొనసాగుతున్న డెవలప్​మెంట్​కు ఆకర్షితుడినై బీజేపీలో చేరినట్లు చెప్పారు.   ఆదర్శ్ స్కామ్ వివాదం, ఇతర ఆరోపణల ప్రభావం ఇందులో లేదని.. కొన్ని మంచి పనులు చేయాలని ప్రోగ్రెసివ్, పాజిటివ్ ఆలోచనతో ముందడుగు వేశానని చెప్పారు. 

తన నిర్ణయాన్ని విమర్శించే వారిపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయబోనని తెలిపారు. కాంగ్రెస్ తనకు చాలా చేసిందని, తాను కూడా పార్టీకి చాలా చేశానని.. దాన్ని ఎవరూ కాదనలేరన్నారు. ఇక నుంచి మహారాష్ట్రలో బీజేపీని మరింత బలోపేతం చేస్తానని, రాబోయే ఎన్నికల్లో పార్టీ మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునేలా అంకితభావంతో పనిచేస్తానని ప్రకటించారు. చవాన్ బీజేపీలో చేరడాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశంసించారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం డెవలప్ అయితున్నది. జాతీయ స్థాయిలో చాలామంది నాయకులు బీజేపీలో చేరాలనుకుంటున్నరు. చవాన్ తనకు ఏ పదవిపై ఆసక్తిలేదని చెప్పారు. పార్టీ, దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నరు. ఆయన అనుభవాన్ని ఎలా వాడుకోవాలో పార్టీ జాతీయ 

నేతలు నిర్ణయం తీసుకుంటరు’ అని అన్నారు.