రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి మృతి

రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి మృతి

విశాఖ పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మృతిచెందారు. శుక్రవారం సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్‌రోడ్డులో వాకింగ్‌ చేస్తుండగా ఓ వాహనం ఆయన్ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సత్యారావును స్థానికులు వెంటనే సమీపంలోని మై క్యూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ఆప్తులు, అనుచరులు, అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. బలిరెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989, 1999లో చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  సత్యారావు మంత్రిగా కూడా పనిచేశారు.

former-minister-balireddy-sathyarao-dies-in-road-accident