రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తోంది : చంద్రశేఖర్ 

రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తోంది : చంద్రశేఖర్ 
  • ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ 4న నిరసన దీక్ష

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చడం కోసమే ప్రధాని మోదీ 400 సీట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ నెల 4న రాజ్యాంగ రక్షణ దీక్ష చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. బుధవారం గాంధీభవన్ లో చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర చేస్తుందని.. అందుకే ‘ఆబ్ కీ బార్ చార్ సౌ కీ పార్’ అనే నినాదాన్ని ఎన్నికల్లో ప్రచారం చేస్తోందని దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతం అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేసిందని, ఇప్పుడు కుల గణన చేసి రిజర్వేషన్లు పెంచాలని ప్రయత్నం చేస్తోందన్నారు. ఎంపీ ఎన్నికలు బీజేపీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు మధ్య  జరుగుతున్న యుద్ధమని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయాలంటే రాజ్యాంగాన్ని మార్చాలని అందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఈ నెల 4న చేపడుతున్న రాజ్యాంగ రక్షణ దీక్షకు రాష్ర్టంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు.