కాంగ్రెస్ లోకి గంగుల!.. త్వరలోనే చేరిక

కాంగ్రెస్ లోకి గంగుల!.. త్వరలోనే  చేరిక
  •  జులై 2న కేబినెట్ విస్తరణ
  •  వాకిటి శ్రీహరికి మంత్రిపదవి
  •  రుణమాఫీ చేసి తీరుతం
  •  హరీశ్ రాజీనామా లేఖ రెడీ చేసుకో
  •  మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి

హైదరాబాద్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని.. ఈ సారి  విస్తరణలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి లభిస్తుందని అన్నారు. ఇవాళ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేశారు.  

త్వరలోనే రైతు రుణమాఫీ చేయబోతున్నామని, మాజీ మంత్రి హరీశ్ రావు తన రాజీనామా పత్రాన్ని రెడీ చేసుకోవాలని సూచించారు.  ఒకే సారి 31 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయబోతున్నామని అన్నారు.  2014 నుండి 2023 వరకు బిఆర్ఎస్ సర్కార్ ఎంత రుణమాఫీ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.