రైతుభరోసా ఎప్పుడు ఇస్తారు: మాజీ మంత్రి హరీష్రావు

రైతుభరోసా ఎప్పుడు ఇస్తారు: మాజీ మంత్రి హరీష్రావు

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసా(పంట పెట్టుబడి సాయం) కింద రైతుకు 15వేలు ఇస్తామని చెప్పారు.. ఎప్పుడు ఇస్తారో రైతులకు చెప్పాలని మాజీ మంత్రి హరీష్రావు కోరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ...కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికి శుభాకాంక్షలు తెలిపిన హరీష్రావు.. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది.. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు.  అధికారం పక్షం  అయినా..ప్రతిపక్షం అయినా  మేం ప్రజలకోసమే పనిచేస్తామన్నారు.

ధాన్యం  ఇప్పుడే అమ్ముకోకండి.. మేం అధికారంలోకి వస్తున్నాం బోనస్ తో ధాన్యం కొనుగోలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు చెప్పారు. అధికారంలోకి వచ్చారు..  500 రూపాయల బోనస్ తో ధాన్యం ఎప్పుడు కొంటారో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల ధాన్యం తడిసింది.. రైతులు నష్టపోయారు.. వారిని ఆదుకోవాలని కోరారు హరీష్ రావు.