మార్క్‌‌‌‌ఫెడ్ ద్వారా పెసర్లు కొనండి

 మార్క్‌‌‌‌ఫెడ్ ద్వారా పెసర్లు కొనండి
  • సీఎం రేవంత్‌‌‌‌కు హరీశ్‌‌‌‌రావు లేఖ

హైదరాబాద్, వెలుగు: ఆహార పంటల బదులు పప్పు ధాన్యాల సాగుతో మెరుగై న లాభాలు సాధించవచ్చన్న రైతుల ఆశలను ప్రభుత్వం అడియాశలు చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటా పెసరకు మద్దతు ధర రూ.8,682 ప్రకటించినప్పటికీ,రాష్ట్రంలో ఆ ధరకు ఎవరూ కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో రూ.6,000 నుంచి రూ.6,500 మధ్యనే రైతులు అమ్ముకుంటున్నారని తెలిపారు.

ఈమేరకు సీఎం రేవంత్‌‌‌‌కు హరీశ్‌‌‌‌రావు బుధవారం బహిరంగ లేఖ రాశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం, పెసర పంట వేసిన రైతులకు శాపంగా మారిం దన్నారు. పంటను మద్దతు ధరకు అమ్మే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా మార్క్‌‌‌‌ఫెడ్ ద్వారా పెసర్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.