‘మూసీ’ పేరుతో వేల కోట్ల స్కాం.. టెండర్లను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం : మాజీ మంత్రి కేటీఆర్‌

‘మూసీ’ పేరుతో వేల కోట్ల స్కాం.. టెండర్లను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం : మాజీ మంత్రి కేటీఆర్‌

ఫతేనగర్: మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల స్కాం జరుగుతోందని మాజీ మంత్రి కేటీఆర్​ఆరోపించారు. మూసీ నదిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం లేదని, గత బీఆర్ఎస్​హయాంలో కట్టిన ఎస్టీపీలను వాడుకుంటే సరిపోతుందన్నారు. మూసీ టెండర్లను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారని ఆరోపించారు. 

బీఆర్ఎస్​బృందంతో కలిసి హైదరాబాద్ ఫతేనగర్​బ్రిడ్జి వద్ద ఎస్టీటీని పరిశీలించిన అనంతరం కేటీఆర్​మీడియాతో మాట్లాడారు. ‘మా హయాంలో 4 వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో  మొత్తం 31ఎస్టీపీలు నిర్మించాం. మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదు. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అసలు ఉద్దేశం వేరే ఉంది. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయమా? పబ్లిక్ సిటీ స్టంట్లతో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు’ అని అన్నారు.