దసరాలోపు మంచినీళ్లు ఇవ్వండి: పీర్జాదిగూడ కమిషనర్‎కు మాజీ మంత్రి మల్లారెడ్డి వినతి

దసరాలోపు మంచినీళ్లు ఇవ్వండి: పీర్జాదిగూడ కమిషనర్‎కు మాజీ మంత్రి మల్లారెడ్డి వినతి

మేడిపల్లి, వెలుగు: దసరా పండుగలోపు పీర్జాదిగూడ ప్రజలకు మంచినీళ్లు అందించి, వారి సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోరారు. స్థానిక సమస్యలపై పీర్జాదిగూడ కమిషనర్ త్రిలేశ్వర్ రావుకు మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి గురువారం ఆయన వినతిపత్రం అందజేశారు. 

అనంతరం మాట్లాడుతూ.. మంచినీటి సరఫరా కోసం కొత్త పైప్​లైన్ ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి అవసరమైన పనులు చేపట్టాలన్నారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి, అన్ని పనులకు టెండర్లు వేసినట్లు చెప్పారన్నారు. దసరా లోపు పనులు పూర్తి చేస్తారన్నారు. మాజీ కార్పొరేటర్లు దొంతురి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేశ్ పాల్గొన్నారు.