
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్నట్టు తెలిసింది. ఆయన నాగర్కర్నూల్నుంచి కాంగ్రెస్ టికెట్ఆశించగా, కొత్తగా పార్టీలోకి వచ్చిన రాజేశ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌పై నాగం అసంతృప్తితో ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఇటీవల తన అనుచరులతో సమావేశమైన ఆయన.. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీకి దిగాలని భావించారు.
అయితే నాగంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాట్లాడి పార్టీలోకి వస్తే సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం నాగం నివాసానికి మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. బీఆర్ఎస్లో చేరాలని ఆయనను ఆహ్వానించనున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే నాగం జనార్దన్ రెడ్డి సీఎం కేసీఆర్‌తో భేటీ అయి బీఆర్ఎస్లో చేరుతారని సమాచారం.