రఘునాథపాలెంను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ దే : పువ్వాడ అజయ్ కుమార్

రఘునాథపాలెంను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ దే : పువ్వాడ అజయ్ కుమార్
  •     మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు :  రఘునాథపాలెం మండలం అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆ పార్టీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం రఘునాథపాలెం మండలంలోని చిమ్మపూడి, పాపటపల్లి, చింతగుర్తి, గణేశ్వరం, వేపకుంట్ల, వీవీ పాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని అభ్యర్థి గెలుపుకు ప్రచారం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త గ్రామ పంచాయతీలను, కొత్త మండలాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ దేనని గుర్తు చేశారు. అన్ని రకాల నిధులతో మండలంలో మట్టి రోడ్లను సీసీ రోడ్లు చేశామని, డ్రైన్లు, నాలుగు లైన్ల రహదారులతో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. 

ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, ఇలాంటి మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యాక్రమంలో మండల అధ్యక్షుడు వీరునాయక్, మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్ర రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.