ప్రలోభాలకు లోనై ఓటు వేయొద్దు : మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

ప్రలోభాలకు లోనై ఓటు వేయొద్దు : మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
  • మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గ్రంథాలయ చైర్​పర్సన్ ​సుహాసిని రెడ్డి 

కౌడిపల్లి, వెలుగు: ప్రజలు, యువకులు క్షణికావేశంలో ప్రలోభాలకు లోనై ఓటు వేయొద్దని, మంచిని చూసి ఓటు వేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్​పర్సన్​సుహాసిని రెడ్డి అన్నారు. సోమవారం కౌడిపల్లి, వెంకట్రావుపేటలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదన్​రెడ్డి మాట్లాడుతూ.. డిగ్రీ కాలేజీకి 10 రూమ్స్ ఫ్రీగా ఇచ్చానని కౌడిపల్లి అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. 

కాంగ్రెస్ అభ్యర్థి మాటూరి శాఖయ్యను ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ప్రజలు ఆదరిస్తే త్వరలో కౌడిపల్లిలో వెజిటేబుల్ మార్కెట్, మటన్ మార్కెట్ ను మరింత అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

 సుహాసిని రెడ్డి మాట్లాడుతూ యువత ఆలోచించి ఓటు వేసినప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. వెంకట్రావు పేటలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసుకుఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మల్లేశం, పాండు, ప్రశాంత్, పాండు, సురేశ్, ఓటర్లు పాల్గొన్నారు.