కమీషన్ల కోసం బీఆర్ఎస్ ​స్కీమ్​లు : మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి

కమీషన్ల కోసం బీఆర్ఎస్ ​స్కీమ్​లు : మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి

ఇందల్వాయి, వెలుగు: కమీషన్లు, కార్యకర్తల కోసమే బీఆర్ఎస్ ​ప్రభుత్వం స్కీమ్​లు ప్రవేశపెడుతోందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్​ నిజామాబాద్​రూరల్​ఇన్​చార్జి డాక్టర్ ​భూపతిరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఇందల్వాయిలో నిర్వహించిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. దళిత బంధు, బీసీ బంధు, గృహ లక్ష్మి స్కీమ్​ల అమలులో అత్యంత అవినీతి జరుగుతోందని, పేదలకు ఒక్కరూపాయి కూడా చేరడం లేదన్నారు. 

అందుకే స్థానిక ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందన్నారు. స్వయంగా సీఎం కేసీఆరే తమ ఎమ్మెల్యే లు దళితబంధు లో 30 శాతం కమీషన్​ తీసుకుంటున్నారని ఒప్పుకోవడం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. సిర్నాపల్లి లోకి ఎమ్మెల్యేని రానివ్వమని దళితులు రోడ్డు బ్లాక్​ చేయడాన్ని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కమీషన్ల ప్రభుత్వాన్ని బొందపెట్టి, కాంగ్రెస్​కు పట్టం కట్టాలన్నారు.అనంతరం ఆశా కార్యకర్తలకు మద్దతుగా వారి ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్​మండలాధ్యక్షుడు నవీన్​గౌడ్, లీడర్లు సంతోష్ రెడ్డి, మోహన్, భైరయ్య పాల్గొన్నారు.