
సీఎం కేసీఆర్ మాటలు ఢిల్లీ దాటుతాయని..చేతలు మాత్రం ప్రగతి భవన్ దాటవని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు మొత్తం అబద్దాలు, మోసాలేనని చెప్పారు. తెలంగాణ మోడల్ అంటే అహంకారం, అప్పు, అవినీతి అని తెలిపారు. కేసీఆర్ ను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెప్తున్నానని..తెలంగాణలో గడీల పాలన నడుస్తుందని వెల్లడించారు.
బంగారు తెలంగాణ అప్పుల మయంగా మారిందని బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. హుజుర్ నగర్ పరిస్థితి చూస్తే అర్థం అవుతుందన్నారు. మున్సిపల్ ఆస్తులను తాకట్టు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఇంటికి కేజీ బంగారం పంచినా ఆయన్ను ఎవరూ నమ్మరని తెలిపారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ చేరి క్రియా శీలకంగా పనిచేశానని..కానీ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష కేవలం నలుగురికి మాత్రమే అన్నట్లు వ్యవరించారని చెప్పారు. అందుకే బాధతో బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. వైఎస్ షర్మిల పార్టీ పెట్టడాన్ని చూసి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టాడని ఎద్దేవా చేశారు