- వివేక్ వెంకటస్వామిపై, నాపై అసత్యప్రచారం
- సీక్రెట్ మీటింగ్ పెట్టుకోలే..ఓపెన్ గానే కలుస్తున్నం
- బీజేపీ గెలుపే లక్ష్యం త్వరలో అమిత్ షాను కలుస్తం
- మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తాను, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారని. కొన్ని పత్రికలు టైం కూడా చెప్పాయన్నారు. తాము సీక్రెట్ గా మీట్ కాలేదని.. ఓపెన్ గానే కలుస్తున్నామని బీజేపీని బలోపేత చేయడం కోసమే చర్చించుకుంటున్నామని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. తమ సమావేశాల్లో సర్వేలు ఎలా ఉన్నాయనే అంశాన్నే మాట్లాడుకుంటున్నామని.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్చలపై చర్చిస్తున్నామని చెప్పారు. త్వరలోనే అమిత్ షాను కలిసి పార్టీని గెలిపించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తామని అన్నారు.
Also Read :- రాష్ట్రాన్ని రక్షించుకోవాలి.. హిందువులంతా ఏకం కావాలి: కిషన్ రెడ్డి
గత కొన్నిరోజులుగా వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ మారుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కాంగ్రెస్ లేదా, బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.