రాష్ట్రంలో కుటుంబ పాలన పోయి ప్రజాపాలన రావాలన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలని.. హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న కిషన్ రెడ్డి. రాష్ట్రం దివాళా తీయకుండా గణేష్ ఆశీస్సులతో మరింత అభివృద్ధి కావాలన్నారు. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్నారని తెలిపారు.
- ALSO READ | ట్యాంక్ బండ్పైనే గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలె : వీహెచ్పీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి
గ్రామాల్లో యువకులు ఒకటై గణేష్ ఉత్సవాలు సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. బాలగంగాధర్ తిలక్ ప్రోత్సాహంతో తొలిసారిగా గణేష్ ప్రతిష్టాపన జరిగిందన్నారు. టైగర్ నరేంద్ర హిందువులను ఏకం చేయడానికి గణేష్ ను ప్రతిష్టాపించారని చెప్పారు.స్వర్గీయ శంకర్ ఖైరతాబాద్ లో గణేషన్ ను ప్రతిష్టించారని తెలిపారు. గణేష్ ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచాయన్నారు.