- మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి, లంబాడీల సంక్షేమం కోసం కేంద్రం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాలని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ, నిధుల ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి కేంద్రానికి పంపించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ మాత్రమే కృషి చేసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే సీఎం రేవంత్ రెడ్డి తండాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేశారని ప్రశంసించారు.
