నవాజ్‌ షరీష్‌ ఆరోగ్యం మరింత విషమం

నవాజ్‌ షరీష్‌ ఆరోగ్యం మరింత విషమం

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం మరింతగా విషమించిందని తెలిపారు ఆయనకు ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లు. నవాజ్ షరీఫ్ గుండెనొప్పితో బాధపడుతున్నారని… రక్తంతో ప్లేట్ లెట్స్ కౌంట్ కనిష్టానికి పడిపోయిందన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందన్నారు. 69 ఏళ్ల వయసులో ఉన్న నవాజ్ షరీఫ్ రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య ఒక్కరోజులోనే 45 వేల నుంచి 25 వేలకు పడిపోయాయని తెలుస్తోంది. ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో నిన్న(సోమవారం) రాత్రి సర్వీసెస్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి కుదుటపడేంత వరకూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయలేమని జైలు అధికారులకు డాక్టర్లు స్పష్టం చేశారు.