గాంధీ అలుమ్నీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్​రెడ్డి మృతి

గాంధీ అలుమ్నీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్​రెడ్డి మృతి
  • నేడు గాంధీ మెడికల్‌‌ కాలేజీకి పార్థివదేహం అప్పగింత

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌‌ గాంధీ మెడికల్‌‌ కాలేజీ అలుమ్నీ అసోషియేషన్‌‌ మాజీ అధ్యక్షుడు, సీనియర్​డాక్టర్‌‌ ప్రతాప్‌‌రెడ్డి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇండో అమెరికన్‌‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గాంధీ మెడికల్‌‌ కాలేజీ 1967 బ్యాచ్‌‌కు చెందిన ప్రతాప్‌‌రెడ్డి స్టూడెంట్‌‌ యూనియన్‌‌ లీడర్‌‌గా పలు పదవులు నిర్వహించారు. గాంధీ అలుమ్నీ అసోషియేషన్‌‌ అధ్యక్షునిగా, ఇండియన్‌‌ మెడికల్‌‌ అసోషియేషన్‌‌(ఐఎంఏ) తెలంగాణ ప్రెసిడెంట్‌‌గా సేవలు అందించారు.

 గాంధీ అలుమ్నీ హెరిటేజ్‌‌ భవనంలో సోమవారం ఉదయం గాంధీ వైద్యుల సందర్శనార్థం ప్రతాప్‌‌రెడ్డి పార్థివదేహాన్ని ఉంచుతారు. అనంతరం వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం గాంధీ మెడికల్‌‌ కాలేజీ అనాటమీ విభాగానికి ప్రతాప్​రెడ్డి భౌతికకాయాన్ని అప్పగించనున్నట్లు గాంధీ అలుమ్నీ అసోషియేషన్‌‌ అధ్యక్షుడు డాక్టర్‌‌ జీఆర్‌‌ లింగమూర్తి తెలిపారు.