V6 News

గ్లోబల్ వార్మింగ్పై 51 హెచ్చరికలు

గ్లోబల్ వార్మింగ్పై 51 హెచ్చరికలు
  • రాష్ట్రపతి మాజీ ఓఎస్​డీ సత్యనారాయణ సాహు 

చేవెళ్ల, వెలుగు:  గ్లోబర్​ వార్మింగ్​ కారణంగా ప్రపంచం ఇప్పటికే 51 హెచ్చరికలు ఎదుర్కోందని రాష్ట్రపతి మాజీ ఓఎస్​డీ, ప్రెస్​ సెక్రటరీ సత్యనారాయణ సాహు ఆందోళన వ్యక్తం చేశారు. డీకార్బనైజేషన్​ పర్యావరణ చర్య కాదని, సామాజిక చర్య అని స్పష్టం చేశారు. బుధవారం చేవెళ్ల ప్రభుత్వ కాలేజీలో  ఐక్యరాజ్య సమితి లక్ష్యాల్లో భాగంగా శాంతి, న్యాయం, బలమైన సంస్థలకు సంబంధించి ఎస్​డీజీ 16వ జాతీయ సదస్సును ప్రారంభించారు. 94 పరిశోధనా  పత్రాల సంకలనాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాంతి, న్యాయం, బలమైన సంస్థలు  రాజ్యాంగం ఇచ్చిన హామీలని, వాటిని కాపాడాల్సిన బాధ్యత సమాజానికి, ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, కన్వీనర్ డాక్టర్​ మొహమ్మద్ అబ్దుల్ మాలిక్, ప్రొఫెసర్​ రాములు, ఇంగ్లిష్​ విభాగం డాక్టర్​ షాజహాన్​ సిద్దిఖీ, ప్రొఫెసర్​ కె. ముత్యంరెడ్డి, సురేందర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.