పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాలి : మాజీ జస్టిస్ ఎన్.వి.రమణ

పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాలి : మాజీ జస్టిస్ ఎన్.వి.రమణ
  • సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ ఎన్.వి.రమణ

మాదాపూర్​, వెలుగు: తల్లిదండ్రులు తమ పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ సూచించారు. విజ్ఞాన జ్యోతి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం మంగళవారం మాదాపూర్​లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఆయన గెస్ట్​గా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లలకు కష్టాలతో కూడిన వాస్తవ జీవితాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

అందమైన జీవితాన్ని మాత్రమే చూపిస్తే, వాస్తవాలు గ్రహించక పిల్లలు ఫ్రస్ట్రేషన్‌‌కు గురయ్యే ప్రమాదముందన్నారు. ఫోన్ల వల్ల సోషల్ మీడియా ప్రభావానికి గురై అనేక మంది పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విజ్ఞాన జ్యోతి పబ్లిక్ స్కూల్ ప్రెసిడెంట్ సురేశ్​బాబు పాల్గొన్నారు.