
తెలంగాణ మాజీ మంత్రి మాతంగి నర్సయ్య కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 20 రోజులుగా చికిత్స పొందుతున్నారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తోడవ్వడంతో నర్సయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగుకాలేదు. ఇలా ఉండగా, 15 రోజుల క్రితం నర్సయ్య భార్య జోజమ్మ కూడా కరోనాతోనే మృతి చెందారు.
వారం వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ కరోనాతో మృతి చెందడంతో కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొంది. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మేడారం అసెంబ్లీ నియోజకవర్గంటీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు నర్సయ్య. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలం పాటు మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన అనంతరం టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వర్తమాన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.