V6 News

కాంగ్రెస్ పార్టీకి షాక్... సీనియర్ నేత రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి షాక్... సీనియర్ నేత రాజీనామా

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి సీనియర్ నేత రాజీనామా చేయడం సంచలనంగా మారింది. మాజీ కేంద్రమంత్రిగా పనిచేసిన అశ్విని కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోనియాకు పంపారు.  ప్రస్తుత పరిణామాలు, దేశ విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, గౌరవప్రదంగా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆ లేఖలో అశ్వని కుమార్ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇది బాధాకరమైన నిర్ణయం. చాలా కష్టపడి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇవాళ కాంగ్రెస్ అంతర్గత ప్రక్రియలు ఎలా ఉన్నాయో గ్రహించానన్నారు. తన  గౌరవం ఆత్మగౌరవానికి అనుగుణంగా తాను ఇకపై పార్టీలో కొనసాగలేనన్నారు. ఈ  బరువును మోయడానికి తన భుజాలు బలంగా లేవని తాను అనుకుంటున్నట్లు అశ్వనీ కుమార్ తెలిపారు. 

పార్టీని నడిపించే పరివర్తన మరియు స్ఫూర్తిదాయకమైన నాయకత్వం కాంగ్రెస్‌కు లేదన్నారు. తాను రాజకీయాలను లేదా ప్రజా సేవను విడిచిపెట్టనన్నారు. దేశానికి తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉంటానన్నారు. కాంగ్రెస్ పార్టీతో 46 ఏళ్ల సుదీర్ఘ పయనం చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన... పార్టీలో తనకు లభించిన గౌరవానికి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆ లేఖలో అశ్వని కుమర్ పేర్కొన్నారు.

అక్టోబర్ 2012 నుంచి మే 2013 వరకు న్యాయ శాఖ మంత్రిగా, జనవరి 2011 నుంచి మే 2013 వరకు ప్రణాళిక మంత్రిత్వ శాఖలో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. 2011 జనవరి నుంచి జూలై వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా, విచార్ విభాగ్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 

ఇవి కూడా చదవండి:  

దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ దోషి

కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎప్పటికీ కలిసే ప్రసక్తి లేదు