టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఈరోజు (ఏప్రిల్ 28) తన 39వ పుట్టినరోజును జరుపుకుంది. అయితే ఈ ఏడాది బర్త్‌డే ఆమెకు చాలా ప్రత్యేకం. గతేడాది డిసెంబర్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న తర్వాత సమంత జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇది. 2023లో 'సిటాడెల్' షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్తలు వచ్చాయి. ఆ సమయంలో రాజ్ నిర్వహించిన మిడ్ నైట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట మళ్లీ వైరల్ అవుతున్నాయి.
'బర్త్‌డే వీక్' పోస్ట్‌తో ఎమోషనల్..
తన పుట్టినరోజుకు రెండు రోజుల ముందు సమంత షేర్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గత ఏడాది కాలంలో తన జీవితంలో సంభవించిన మార్పులను ఆమె అత్యంత లోతుగా విశ్లేషించారు. జీవితంలో ప్రతిదీ ప్లాన్ ప్రకారం జరగదు.. కానీ నా సంకల్పం మాత్రం మారలేదు అంటూ ఆమె పేర్కొన్నారు. గతంలో ఇతరుల ఎంపికల కోసం ఎదురుచూసే స్వభావాన్ని వదిలేశానని, ఇప్పుడు తన మనసు చెప్పే మాటే వింటున్నానని చెప్పారు. తనను నియంత్రించాలనే ఆలోచనను, తొందరపడే స్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టి, ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆమె వెల్లడించారు.
యాక్షన్ మోడ్‌లో 'మా ఇంటి బంగారం'
సమంత కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం 'మా ఇంటి బంగారం'. నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రోజు ( ఏప్రిల్ 28, 2026 ) సమంత పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ సమంతను 'బీస్ట్' అని అభివర్ణించారు.. ఈ సినిమాలో సమంత చీర కట్టుకుని సాహసోపేతమైన స్టంట్స్ చేశారట. ఒక సాధారణ గృహిణి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటం చేసిందనేది ఈ సినిమా కథాంశం. మే 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
సమంత పుట్టినరోజు సందర్భంగా చిత్ర పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మరో లేడీ సూపర్ స్టార్ నయనతార సమంతను "The Sweetest Girl" అని సంబోధిస్తూ విష్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులను దాటుకుని, కెరీర్ పరంగా సరికొత్త ప్రయోగాలు చేస్తూ, వైవాహిక జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సమంతకు ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
#Samantha celebrates her birthday 🎂 witn her fans
— Movies Singapore (@MoviesSingapore) April 28, 2026
Happy Birthday To The Talented Incredible, Inspirational actress @Samanthaprabhu2
Can’t wait for #MaaIntiBangaram on May 15th 🙌🏻🙌🏻 pic.twitter.com/9ODGccI5Vg

